
Rahul Chahar: ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటికే శిఖర్ ధవన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చహల్, హార్దిక్ పాండ్యా వరుసగా విడాకులు తీసుకున్నారు. వివాహ బంధంలో ఇమడలేక భార్యలతో బంధాలను తెగదెంపులు చేసుకుంటున్నారు. తాజాగా, ఈ జాబితాలోకి మరో టీమిండియా క్రికెటర్ కూడా జాయిన్ అయ్యాడు. మరో టీమిండియా ఆటగాడు రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహర్తో విడాకులు తీసుకున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 20) ప్రకటించాడు. ఈ విషయాన్ని చాహర్ ఓ భావోద్వేగపూర్వక నోట్ లో ఎక్స్ ( ట్విట్టర్)లో షేర్ చేశాడు.
చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను, అప్పట్లో తనను తాను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను.. ఈ పెళ్లి నాకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిందని రాహుల్ చాహర్ పేర్కొన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా అనుకోని గుణపాఠాలు నేర్పాయని, గత 15 నెలలు కోర్టు ప్రక్రియలతో గడిచిపోయాని తెలియజేశాడు. ఈ సమయం తనకు సహనం, ధైర్యం నేర్పిందని చెప్పుకొచ్చాడు. ఈ అధ్యాయనం ఇప్పటికి ముగిసింది.. ఇకపై స్వాభిమానంతో, ప్రశాంతంగా, మంచి నిర్ణయాలతో కొత్త జీవితం ప్రారంభిస్తానని వెల్లడించాడు.
ఇషానీ జోహర్ ని ప్రేమించిన రాహుల్ చాహర్ 2019 డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకుని.. 2022 మార్చిలో గోవాలో ఓ ప్రైవేట్ రిసార్ట్స్ లో పెళ్లి చేసుకున్నారు. ఇషానీ ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తూ, తరచూ రాహుల్ ఆడే మ్యాచ్ లకి హాజరై సపోర్టు ఇచ్చేది.. దీంతో వారి బంధం సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలను కూడా అందుకుంది. విడాకులు తీసుకునేందుకు స్పష్టమైన కారణాలను మాత్రం ఇంకా తెలియరాలేదు కానీ, చాహర్ ఇవాళ విడాకులు తీసుకున్నట్లు మాత్రం ప్రకటించి, అందరినీ షాక్ కి గురి చేశాడు. విడాకుల తర్వాత రాహుల్ చాహర్ తిరిగి క్రికెట్ పై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్ లలో 6 వికెట్లు మాత్రమే తీసిన అతడు.. తిరిగి ఫామ్ లోకి రావాలని కష్టపడుతున్నాడు. చాహర్ ని 2026 ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.2 కోట్లకు దక్కించుకుంది. ఈసారి ఐపీఎల్ లో ఫామ్ సాధించి తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేసే అవకాశం ఉంది.
Playing for my country has been the biggest dream, a feeling I can never express. Happy Independence Day to my fellow Indians. Jai Hind. 🇮🇳 pic.twitter.com/mYTwW0y8vP
— Rahul Chahar (@rdchahar1) August 15, 2021