Reading Time: < 1 minute

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం… 

Caption of Image.

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కార్ప్స్ సంస్థతో కీలక ఒప్పందం చేసుకుంది విద్యాశాఖ. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 42 వేల 230 గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పొందుతున్న 30 లక్షల 23 వేల మంది విద్యార్థులకు మేలు జరగనుందని తెలిపింది ప్రభుత్వం.

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని తెలిపింది ప్రభుత్వం. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా డేటా అనలిటిక్స్, AI వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. 

మధ్యాహ్న భోజనం తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఖచ్చితంగా అంచనా వేయడం, పోషక ప్రమాణాలు ట్రాక్ చేయడం, నిర్వహణ వ్యయం తగ్గించడం వంటి కీలక అంశాల్లో IIC బృందం సాయపడుతుందని తెలిపింది ప్రభుత్వం.
 

©️ VIL Media Pvt Ltd.