Reading Time: < 1 minute
Allari Naresh : అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..

టాలీవుడ్ దర్శకుడు దివంగత ఇ.వి.వి. సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లకు తాత అయిన ఈదర వెంకట్ రావు సోమవారం (జనవరి 19) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు.