
సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా.? మీకోసమే టీజీఎస్ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ తీసుకోచ్చేసింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు ఏకంగా 5 వేలకుపైగా స్పెషల్ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు 2500 బస్సులు.. ఏపీకి 3 వేల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన వివరాలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనుంది ఆర్టీసీ. జనవరి 9వ తేదీ నుంచి సొంతూరుకు వెళ్లే ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి. అటు ముందస్తు రిజర్వేషన్ల దృష్ట్యా పెద్ద ఎత్తున బస్సులను అందుబాటులో ఉంచనుంది TGSRTC.
This festive season, travel with ease!
Plan ahead and book your bus tickets on the official TGSRTC online booking app.
https://t.co/Pqr2EOGmhI#Sankranti #FestiveTravel #TGSRTC #BusTravel #TravelSafe pic.twitter.com/pvKRiDMbhh
— TGSRTC (@TGSRTCHQ) January 3, 2026
అటు ఏపీఎస్ఆర్టీసీ విషయానికొస్తే.. సంక్రాంతికి జనవరి 8 నుంచి 14 వరకు 596 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ బస్సులు జనవరి 17 నుంచి 19 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరో 150 బస్సులను పెంచేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కాగా, తెలంగాణలో ప్రభుత్వ , ప్రైవేట్ స్కూల్స్‌కు ఈనెల 10 నుంచి 16 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Plan ahead and book your bus tickets on the official TGSRTC online booking app.