
కాలంతో పాటుగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అలా ప్రతి ఇంట్లో తప్పనిసరి వస్తువుగా స్థానం సంపాదించుకున్నదే రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్). అయితే 1820వ దశకంలో మైఖేల్ ఫారడే, జాకబ్ పర్కిన్స్ అనే శాస్త్రవేత్తలు ఫ్రిజ్ తయారీకి పునాది వేశారు. పూర్తిస్థాయిలో రిఫ్రిజిరేటర్‌ను రూపొందించిన మొదటి వ్యక్తి మాత్రం జాకబ్ పర్కిన్స్. తొలుత వీరద్దరూ కలిసి పీడనం ద్వారా అమ్మోనియా వాయువును ద్రవంగా మార్చడం, తిరిగి పీడనం తగ్గించినప్పుడు అది ఆవిరవుతూ వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి వస్తువులను చల్లబరచడం అనే సూత్రం ఆధారంగా ఈ ప్రిజ్ నడుస్తోందని కనిపెట్టారు.
అయితే తొలినాల్లో ఫ్రిజ్‌లో చల్లదనాన్ని ఏర్పాటు చేసేందుకు తొలి రిఫ్రిజిరేటర్లలో నిర్జల అమ్మోనియా వాయువును ఉపయోగించారు, కానీ ఇది అత్యంత విషపూరితమైనది కావడంతో. తర్వాత దానికి ప్రత్యమ్నాయంగా సల్ఫర్ డయాక్సైడ్ వాడారు. కానీ ఇది కూడా సురక్షితం కాదని తేలడంతో తర్వాత డైక్లోరోడైఫ్లోరోమీథేన్ వాయును ఫ్రిజ్‌లో శీతలీకరణ ప్రక్రియలో వాడడం స్టార్ట్ చేశారు. అయితే దీని వల్ల మానవులకు ఎలాంటి హానీ లేనప్పటికీ.. దీని వల్ల భూమిని రక్షించే ఓజోన్ పొర మాత్రం తీవ్రంగా దెబ్బతింటోందని గ్రహించిన.. ప్రపంచ వ్యాప్తంగా డైక్లోరోడైఫ్లోరో మీథేన్‌తో నడితే రిప్రిజియేటర్లను పూర్తిగా బ్యాన్ చేశారు.
ఇక అప్పటి నుంచి పర్యావరణానికి, మానవులకు ఎలాంటి హాని చేయని వాయువులను మాత్రమే రిప్రిజియేటర్లలో వాడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్టుగా సింగిల్ డోర్, డబుల్ డోర్ వంటి అనేక మోడల్స్‌లో వీటిని అందిస్తున్నాయి.
అయితే చాలా మంది ఫ్రిజ్‌లు కొన్నప్పటికీ వాటిని ఎలా వాడాలో తెలియదు. దీని వల్ల అవి త్వరగా పాడైపోతుంటాయి. కొందరు సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రిజ్‌ను ఒకే మోడ్‌లో వాడుతారు. అలా కాకుండా రిఫ్రిజిరేటర్ నాబ్‌లపై ఉన్న అంకెల ఆధారంగా ఏ సీజన్‌లో ఏ మోడ్ పెట్టాలో అనేది తెలుసుకొవాలి. అంతేకాదు చాలా మంది ప్రిజ్‌ను గోడకు ఆనించి పెడతారు. కానీ ఇలా పెడితే ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఫ్రిజ్‌కు గోడకు గ్యాప్ ఉండేలా పెట్టాలి. ఫ్రిజ్‌ను మళ్లీ మళ్లీ తెరిచి, మూస్తూ ఉండకండి.. ఇలా చేస్తే కరెంటు బిల్లు ఎక్కవగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫ్రిజ్‌లో కూరగాయలను లిమిటెడ్‌గా ఉంచండి.. ఎక్కువగా ఎప్పుడూ పెట్టకండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.