Reading Time: < 1 minute

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల..

Caption of Image.

పోలవరం ఎడమ కాల్వ నుంచి అనకాపల్లి జిల్లాకు నీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. బుధవారం ( సెప్టెంబర్ 2 ) మంత్రి రామానాయుడు రైతులతో కలిసి రెగ్యులేటర్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.అనంతరం అక్కడే సీఎం చంద్రబాబు పుష్కర జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి సమర్పించారు. ఆ తర్వాత గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్ధించారు సీఎం చంద్రబాబు.

పోలవరం ప్రాజెక్ట్ ను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కార్. అంతకంటే ముందుగానే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి ఈ కాల్వ పనులు వేగవంతంగా పూర్తి చేసింది.

►ALSO READ | తిరుమల కొండపై ఆధిపత్యపోరు వల్లే లోకనాథంపై ఏసీబీ దాడులు : భూమన సంచలన కామెంట్స్

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని నేలకోట దగ్గర ప్రారంభమయ్యే ఎడమ కాలువ విశాఖపట్నం వరకు 213.409 కిలోమీటర్ల మేర ఉంది. ప్రధాన డ్యామ్ పూర్తికాకపోయినప్పటికీ గతంలో నిర్మించిన పుష్కర, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి నీటిని  ఎడమకాలువలోకి తరలిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.