Reading Time: < 1 minute
Amaravati Farmers Get 37 Returnable Plots Through E Lottery

Amaravati Farmers: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కూటమి ప్రభుత్వం.. అమరావతి ప్రాంత రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ-లాటరీ విధానంలో 17 మంది రైతులకు మొత్తం 37 ప్లాట్లను కేటాయించారు. ఇందులో 24 రెసిడెన్షియల్‌ ప్లాట్లు, 13 కమర్షియల్‌ ప్లాట్లు ఉన్నాయి. నెక్కల్లు, తుళ్లూరు, శాఖమూరు, కొండమరాజుపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చెందిన రైతులకు ఈ ప్లాట్లను అధికారులు కేటాయించారు. గతంలో కేటాయించిన ప్లాట్ల విషయంలో వీధిపోటు, కోర్టు కేసులు, భూసేకరణ వంటి సమస్యలు తలెత్తడంతో ఆయా రైతులకు ప్రత్యామ్నాయంగా కొత్త రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ-లాటరీ విధానం ద్వారా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. సమస్యల కారణంగా పాత ప్లాట్లను వినియోగించుకోలేని రైతులకు కొత్త ప్లాట్లు కేటాయించడంతో వారి ప్రయోజనాలు కాపాడినట్లయింది.