
ముంబై: 1994 నాటి రోడ్డు ప్రమాద కేసులో ముంబై మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) కీలక తీర్పు వెలువరించింది. ప్రమాద బాధితుని కుటుంబానికి వడ్డీతో సహా సుమారు రూ. 33.6 కోట్లు చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. తద్వారా 32 ఏండ్ల తర్వాత వెలువడిన ఈ తీర్పు భారతదేశ చరిత్రలోనే అత్యధిక రోడ్డు ప్రమాద పరిహారాలలో ఒకటిగా నిలిచింది.
అసలేం జరిగిందంటే..?
1994, జూలై 3న ముంబైలోని థానే-నాసిక్ జాతీయ రహదారిపై ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దుబాయ్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్న కవితా సావ్లానీ , కంచన్ మెల్వానీ ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కవితా భర్త సురేష్, వారి పిల్లలు పూజ, అవినాష్ నష్ట పరిహారం చెల్లించాలని 1994, డిసెంబర్ 23న కోర్టును ఆశ్రయించారు.
►ALSO READ | దిశాసాలియన్ ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకి.. సీబీఐకి అప్పగించాలని ముంబై హైకోర్టు ఆదేశం
ప్రమాదం జరిగిన 1994 నాటికే కవితా సావ్లానీ దుబాయ్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా ఏడాదికి సుమారు రూ.70 లక్షల వరకు సంపాదిస్తూ ఉండేవారు. ఆమె ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని పరిగణలోకి తీసుకున్న కోర్టు మృతురాలి కుటుంబానికి రూ. 8.8 కోట్లు చెల్లించాలని ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను ఆదేశించింది. అయితే, కవితా సావ్లానీకి ఎటువంటి అధికారిక విద్యార్హత సర్టిఫికేట్లు లేవని సదరు బీమా సంస్థ కోర్టులో వాదించింది.
కానీ మృతురాలి కుటుంబ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రూ. 8.8 కోట్లు చెల్లించాల్సిందేనని ఆదేశించింది. కేసు 1994 నుంచి పెండింగ్‌లో ఉన్నందున బాధిత ఫ్యామిలీ పిటిషన్ దాఖలు చేసిన నాటి నుంచి సంవత్సరానికి 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని బీమా కంపెనీని కోర్టు ఆదేశించింది. ఈ వడ్డీ మొత్తం యాడ్ అవ్వడం వల్లే మొత్తం క్లెయిమ్ విలువ రూ. 33.6 కోట్లకు చేరింది.