Reading Time: < 1 minute
Google Cuts Free Storage To 5gb For New Accounts Heres How To Get 15gb Back

గూగుల్ దీర్ఘకాలం నుంచి ఉన్న 15GB ఫ్రీ స్టోరేజ్ పాలసీలో గ్రాండ్ మార్పు చేసింది. 2026 మే నుంచి కొత్త గూగుల్ అకౌంట్లు (Gmail, Drive, Photos) క్రియేట్ చేసేటపుడు డిఫాల్ట్‌గా కేవలం 5GB స్టోరేజ్ మాత్రమే ఇస్తోంది. 15GB పొందాలంటే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ (Phone Number Linking) తప్పనిసరి చేసింది. ఇది ఇప్పటికి టెస్టింగ్ దశలో ఉన్నప్పటికీ, చాలా మంది యూజర్లు ఈ మార్పును గమనించారు.

ఎందుకు ఈ మార్పు?

గూగుల్ స్పామ్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు తగ్గించడం, సెక్యూరిటీ పెంచడం కోసం ఈ విధానం అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇప్పటికి పాత అకౌంట్లకు ఎలాంటి మార్పు లేదు. కేవలం కొత్త అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుంది.

15GB ఫ్రీ స్టోరేజ్ ఎలా తిరిగి పొందాలి?

కొత్త గూగుల్ అకౌంట్ సృష్టించేటప్పుడు సైనప్ ప్రాసెస్‌లో ఫోన్ నంబర్ జోడించే ఆప్షన్ వస్తుంది.
మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫై చేయండి.
వెరిఫికేషన్ పూర్తి కాగానే 15GB స్టోరేజ్ అన్‌లాక్ అవుతుంది.

ఇప్పటికే 5GBతో అకౌంట్ తెరిచి ఉంటే Gmail లేదా Google Account Settingsలోకి వెళ్లండి.
“Add phone number” ఆప్షన్ కనిపిస్తుంది.
ఫోన్ నంబర్ జోడించి వెరిఫై చేయండి.
కొన్ని గంటల్లో లేదా తక్షణం 15GBకి అప్‌డేట్ అవుతుంది.

ఫోన్ నంబర్ ఇవ్వడానికి ఇష్టపడని వారు.. 5GBతోనే కంటెంట్ చేసుకోవాలి లేదా Google One చెల్లించి అదనపు స్టోరేజ్ కొనాలి.
ఒక్క ఫోన్ నంబర్‌తో ఎన్ని అకౌంట్లు వెరిఫై చేయవచ్చో గూగుల్ పరిమితి విధించవచ్చు.
పాత అకౌంట్లు (ముందు సృష్టించినవి) ఇప్పటికీ 15GB ఫ్రీగానే ఉంటాయి.