Reading Time: < 1 minute
Tech Layoffs 2026 May Ai Job Cuts Companies List

Tech Layoffs 2026: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రాకతో పరిస్థితి తారుమారైంది. గ్లోబల్ టెక్ కంపెనీలు తమ స్టాఫ్‌ను తగ్గించుకుని, ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చుల్ని తగ్గించుకోవడానికి లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ఏడాది మే నెల తొలి రెండు వారాల్లోనే ఏకంగా 25,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

Layoff.fyi గణాంకాల ప్రకారం, PayPal 4,700 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా, ఆ తర్వాతి స్థానంలో సిస్కో నిలిచింది. ఈ సంస్థ 4000 మందిని తీసేసింది. ఏఐ కారణంగా రాబోయే రెండు నుంచి మూడేళ్లలో తన ఉద్యోగుల సంఖ్యను సుమారు 20 శాతం మేర తగ్గించాలని PayPal యోచిస్తోంది. సిస్కో కూడా ఏఐ ప్రణాళికలపై దృష్టి పెట్టడంతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

క్లౌడ్‌ఫ్లేర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1,100 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ 875 ఉద్యోగాలను తగ్గించగా, ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ సంస్థ బిల్‌డాట్‌కామ్ 709 మందిని తొలగిస్తోంది. క్రిప్టో ఎక్స్చేంజ్ సంస్థ కాయిన్‌బేస్ కూడా 700 ఉద్యోగాలను తగ్గిస్తోంది. ఇండియన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫ్రెష్‌వర్క్స్ 500 మందిని తొలగిస్తోంది. టికెట్ బుకింగ్ సంస్థ టికెట్‌మాస్టర్ 350 ఉద్యోగాలను తగ్గిస్తుండగా, జూమ్‌ఇన్ఫో 300 మందిని తొలగిస్తోంది. AI ట్రాన్స్‌లేషన్ టెక్నాలజీ కంపెనీ డీప్‌ఎల్ కూడా 250 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.