Reading Time: < 1 minute

లండన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి చెందాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం పరిధిలోని కొండయ్యపేటకు చెందిన గొంతి అభిషేక్(28) మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఎంబిఎ చేసేందుకు మూడేళ్ల క్రితం లండన్ వెళ్లిన అభిషేక్.. చదువు అనంతరం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అరు నెలల క్రితం స్వస్థలానికి వచ్చి తిరిగి వెళ్లాడు. అభిషేక్ తండ్రి ఆస్కారరావు ఆగిరిపల్లి పిహెచ్‌సిలో సిహెచ్‌వొగా పని చేస్తున్నారు.