Reading Time: < 1 minute

హైదరాబాద్: పెళ్లి చేసుకోబోతున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందనాకు పిఎం మోడీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్-రష్మిక పెళ్లి వేడుకకు ప్రధానిని ఆహ్వానించడంతో ఆయన వారికి లేఖ రాశారు. వివాహ పత్రిక అందుకోవడం ఆనందంగా ఉందని మోడీ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాల్లో కాకుండా నిజం జీవితంలో ఇద్దరు ప్రేమానురాగాలతో కొత్త జీవితాన్ని అందంగా నిర్మించుకోవాలని పిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సప్తపది పవిత్ర సంప్రదాయంతో జీవితాంతం స్నేహితులు, దంపతులుగా అన్యోన్యంగా ఉండాలన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం సాఫీగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విజయ్-రష్మికల జీవితం అద్భుతంగా ఉండాలన్నారు. ఫిబ్రవరి 26న విజయ్-రష్మిక ఉదయ్ పూర్‌లో వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటులు, అతిరథ మహారథులు హాజరుకానున్నారు.