Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నుంచి ఖాళీగా ఏర్పడిన రెండు రాజ్యసభ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఒక స్థానానికి రాజ్యసభ పదవీకాలం ముగిసిన పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వికే తి రిగి అవకాశం కల్పించి, మిగిలిన స్థానానికి జ స్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉ న్నట్టు పార్టీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. పార్టీ పెద్దలతో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, పీసీ సీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ఇంచార్జీ మీ నాక్షి నటరాజన్‌తో పాటు మంత్రులు భేటీ అ యిన సందర్భంగా రాజ్యసభకు ఎవరిని ఎం పిక చేయాలన్న ప్రస్తావన వచ్చిన విషయం తె లిసిందే. అయితే ఈ అంశంపై చర్చించడానికి త్వరలో రాష్ట్ర ముఖ్యులను ఢిల్లీకి రప్పించనున్నట్టు అధిష్ఠానంం చెప్పినట్టు సమాచారం.

ఈ మేరకు రేపో, మాపో సీఎం రేవంత్‌రెడ్డితో సహా ఐదుగురు సభ్యుల కమిటీ ఢిల్లీకి వెళ్లబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం. వీరిలో పిసిసి అధ్యక్షుడు మహేశ్కు మార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఏఐసిసి ఎన్నికల కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉంటారని పార్టీ వర్గాల సమాచారం. ఇలా ఉండగా రాజ్యసభకు పోటి చేయడానికి మార్చి 6వ తేది వరకే నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది. ఆ లోగానే ఇద్దరు అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం సూచనప్రాయంగా ఒక అభిప్రాయానికి వచ్చిందని, తమ ప్రతిపాదనకు రాష్ట్ర నాయకత్వం ముందు ఉంచి వారితో మమా అనిపించడమే మిగిలిందని కూడా చెబుతున్నారు.

సింఘ్వి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు?

ప్రస్తుతం రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉండి రిటైర్ కాబోతున్న అభిషేక్ మను సింఘ్వికే తిరిగి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. అభిషేక్ సింఘ్వి ప్రముఖ న్యాయవాది పైగా ఏఐసిసికి సంబంధించిన కోర్టు వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటుండటంతో తిరిగి ఆయనకు అవకాశం కల్పించడానికి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. కాగా మిగిలిన స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపైనే సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకత్వం, ముఖ్యనేతలతో అధిష్ఠానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.

స్టిస్ సుదర్శన్ రెడ్డికి అవకాశం?

మూడు నెలల క్రితం ఉప రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని యుపిఏ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకత్వం పోటీ చేయించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ తమ మాటను కాదనకుండా బరిలోకి దిగిన ఆయనను రాజ్యసభకు పంపించి గౌరవించాలని అధిష్టాన పెద్దల అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర నేతలతో కూడా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలని అధిష్టానం భావిస్తోన్నట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే పార్టీ పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సూచనప్రాయంగా తెలియజేసినట్టు కూడా ఈ వర్గాల సమాచారం.

ఏదైనా బలమైన కారణాల వల్ల జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖారారు కాని పక్షంలో ఇతర పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని ఈ వర్గాలు చెబుతున్నాయి. వారిలో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు సిడబ్లూసికి ప్రత్యేక ఆహఆ్వనితుడు, కేసీ వేణుగోపాల్‌కు సన్నిహితుడు, పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్‌నగర్ నుంచి పోటి చేసి ఓడిపోయిన డాక్టర్ వంశీచంద్ రెడ్డి పేరు కూడా పరిశీలనకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ బీసీ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలనుకుంటే మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, వి. హనుమంత రావు పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.