Reading Time: < 1 minute

కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోండి..మార్నింగ్ వాకింగ్..ఈవినింగ్ వ్యాయామం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

తెలంగాణలో  2034 వరకు ప్రజలు కాంగ్రెస్ నే ఆదరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోవాలన్న  సీఎం రేవంత్..ఆయన ఆరోగ్యంపై పలు సలహాలు  ఇచ్చారు .  కేసీఆర్ ఉదయం వాకింగ్..సాయంత్రం వ్యాయామం చేయాలని సూచించారు. పిల్లిశాపనార్థాలతో ఉట్టి తెగదన్నారు.  బీఆర్ఎస్ నేతలు ఇంకో పదేండ్లు ఆరోగ్యంగా ఉండాలి.. అందుకు పుస్తకాలు చదవాలి, ప్రవచనాలు వినాలని చెప్పారు.  ఎంపీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజల తీర్పు చూసైనా బీఆర్ఎస్ తీరు మారడం లేదన్నారు. 

 కేసీఆర్,హరీశ్ రావు అసెంబ్లీకి వస్తే నది జలాలపై  చర్చిద్దామన్నారు రేవంత్.  చౌకబారు ఆరోపణలతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయొద్దని సూచించారు. పదేండ్లు అనుభవం ఉన్న కేసీఆర్, హరీశ్ సలహాలు, సూచనలు ఇస్తే పాటిస్తామన్నారు.  తెలంగాణలో గెలిచి ఏపీకి ఎందుకు సహకరిస్తామని ప్రశ్నించారు.  గోదావరిలో నీటి హక్కులను కాపాడుతామని..ఎవరూ టెన్షన్ పడొద్దని సూచించారు రేవంత్.  సాగునీటి ప్రాజెక్టులు 70 శాతం పూర్తయినా నిధులు లేక ఆగాయన్నారు. చ్చే రెండేండ్లలో తుమ్మిడి హెట్టి నుంచి భద్రాచలం గోదావరి పరివాహక ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు రేవంత్.  

©️ VIL Media Pvt Ltd.