Reading Time: 2 minutes

Aishwarya Rajesh: నల్లగా ఉన్నావన్నారు.. హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు.. ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ !

Caption of Image.

సినీ ఇండస్ట్రీలో రంగు, రూపం మాత్రమే ప్రామాణికం అనుకునే వారికి తన నటనతో సమాధానం చెప్పిన నటి  ఐశ్వర్య రాజేష్. దక్షిణాదిలో విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈమె ప్రయాణం పూల బాట ఏమీ కాదు. ఆరంభంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలే నేడు తనను ఒక పవర్‌హౌస్ పర్ఫార్మర్‌గా నిలబెట్టాయని చెబుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

సొంత గడ్డపై చిన్నచూపు

ఐశ్వర్య రాజేష్ అసలు సిసలైన తెలుగు అమ్మాయి. అయినప్పటికీ, కెరీర్ ఆరంభంలో టాలీవుడ్‌లో ఆమెకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. హీరోయిన్ అంటే తెల్లగా ఉండాలి, జీరో సైజ్ మెయింటైన్ చేయాలి అనే మూస ధోరణిలో ఉన్న కొందరు మేకర్స్ ఆమెను దారుణంగా తిరస్కరించాని చెప్పుకొచ్చింది.. నువ్వు హీరోయిన్‌గా పనికిరావు.. కనీసం హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌కు కూడా సూట్ అవ్వవు అని ముఖం మీదే చెప్పిన సందర్భాలు ఉన్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు.  ఆ మాటలు విన్పప్పుడు ఎంతో బాధపడ్డాన ని. హీరోయిన్ కావాలనే ఆశల కంటే.. అవమానాలే తనలో కొత్త పట్టుదలను పెంచాయని చెప్పుకొచ్చింది.. తనలోని ప్రతిభను గుర్తించని చోట కాకుండా, నటనకు ప్రాధాన్యం ఇచ్చే కోలీవుడ్‌లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

తమిళంలో విజయకేతనం.. తెలుగులో రీఎంట్రీ

తమిళంలో ‘కాకా ముట్టై’ వంటి చిత్రాల్లో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత విజయ్ సేతుపతి, ధనుష్ వంటి అగ్ర హీరోలతో నటిస్తూ తనదైన ముద్ర వేశారు. నెమ్మదిగా తన ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని కూడా ఆకర్షించారు. తెలుగులో ఆమె నటించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’లో ఒక క్రికెటర్‌గా ఆమె చూపిన నటన అద్భుతం. ఇది ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. “వరల్డ్ ఫేమస్ లవర్” మూవీలో విజయ్ దేవరకొండ సరసన ‘సువర్ణ’ అనే మధ్యతరగతి గృహిణి పాత్రలో ఒదిగిపోయి నటించారు. ‘టక్ జగదీష్’ లో నాని సరసన కీలక పాత్రలో మెప్పించారు. విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో నటించి ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

►ALSO READ | Vishwak Sen CULT Teaser: రక్తపాతం.. వణుకు పుట్టించే వయోలెన్స్.. విశ్వక్ సేన్ ‘కల్ట్’ టీజర్ విధ్వంసం!

అభినయమే ఆయుధం

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథా బలమున్న చిత్రాలను ఎంచుకోవడంలో ఐశ్వర్య దిట్ట. అట్టడుగు వర్గాల మహిళల పోరాటాలను వెండితెరపై ప్రతిబింబించడంలో ఆమెకు సాటిలేదు. అందుకే నేడు ఆమెను ‘నేచురల్ యాక్ట్రెస్’ అని పిలుచుకుంటున్నారు. నల్లగా ఉన్నానని అవమానించిన వారే.. నేడు ఆమె నటనను చూసి జేజేలు పలుకుతున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం వరిస్తుందని ఐశ్వర్య రాజేష్ నిరూపించారు.
 

 

©️ VIL Media Pvt Ltd.