
‘హంగామా’, ‘భూర్ భూలయ్య’, ‘డ్రీమ్ గర్ల్ ‘2,’ బేబీజాన్ ‘తదితర హిందీ చిత్రాల్లో కమెడియన్ గా రాణించిన బాలీవుడ్ నటుడు రాజా పాల్ యాదవ్. ‘కిక్ 2’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరాఠీ, భోజ్ పురి, పంజాబీ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించాడు. హాస్య నటుడిగా కోట్లాది మందిని నవ్వించిన రాజ్ పాల్ నవ్వుల వెనుక ఒక తీరని ఆర్థిక సంక్షోభం నెలకొంది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న చెక్ బౌన్స్ కేసుల పరంపర చివరకు ఆయనను జైలు గడప తొక్కెలా చేసింది.
నవ్వుల వెనుక నలిగిన జీవితం..
2010లో రాజ్‌పాల్ యాదవ్ తన దర్శకత్వ ప్రతిభను చాటుకోవాలని ‘అతా పతా లాపతా’ అనే సినిమాను నిర్మించారు. ఇందుకోసం మురళీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ నుండి రూ. 5 కోట్ల అప్పు తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. అప్పులు తీర్చలేక, ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో రాజ్‌పాల్ , ఆయన భార్య రాధా యాదవ్ చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు.
కోర్టు ఆగ్రహం…
ఫిబ్రవరి 4న ఢిల్లీ హైకోర్టు రాజ్‌పాల్ యాదవ్‌కు గడువు పొడిగించేందుకు నిరాకరించింది. పదేపదే అప్పు చెల్లిస్తానని కోర్టుకు హామీ ఇచ్చి, మాట తప్పడంతో ఆయన తీరుపై న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4 సాయంత్రం 4 గంటల లోపు లొంగిపోవాలని ఆదేశించడంతో, ఆయన తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. తాజాగా తన ఆర్ధిక ఇబ్బందుల గురించి అక్కడి జైలు అధికారులతో అభిప్రాయాన్ని పంచుకున్నాడు. “నా దగ్గర పైసలు లేవు.. ఎవరూ తోడు లేరు.. నేనిక్కడ ఒంటరివాడిని, లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేద అంటూ అధికారుల ముందు రాజ్‌పాల్ విలపించిన తీరు అందరినీ కలిచివేసింది.
అండగా నిలుస్తున్న సెలబ్రిటీలు
రాజ్‌పాల్ యాదవ్ దీనస్థితి చూసి రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆర్జేడీ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ రాజ్‌పాల్ కుటుంబానికి రూ. 11 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మానవతా దృక్పథంతో ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. “మమ్మల్ని నవ్వించిన గొప్ప కళాకారుడు ఈ స్థితిలో ఉండటం బాధాకరం. ఇండస్ట్రీ ఒక కుటుంబం లాంటిది.. మనవాళ్లను మనం వదులుకోకూడదు” అంటూ నిర్మాతలు, దర్శకులు ఆయనకు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు.
मुझे अभी मेरे बड़े भाई राव इंदरजीत यादव जी की पोस्ट के माध्यम से माननीय राजपाल यादव जी के परिवार की पीड़ा के विषय में जानकारी प्राप्त हुई।
इस अत्यंत कठिन समय में मैं और मेरा पूरा JJD (जन शक्ति जनता दल) परिवार, उनके शोकाकुल परिवार के साथ पूरी संवेदना और मजबूती से खड़ा है।मानवीय… pic.twitter.com/IG4iblPRRq
— Tej Pratap Yadav (@TejYadav14) February 10, 2026
అటు వివాదాస్పద విమర్శకుడు కేఆర్కే సైతం తన వంతుగా రూ. 10 లక్షలు ఇస్తానని, బాలీవుడ్ ప్రముఖులంతా కలిసి రూ. 5 కోట్లు పోగుచేస్తే రాజ్‌పాల్ వెంటనే బయటకు రావొచ్చని పిలుపునిచ్చారు. రియల్ హీరో సోనూ సూద్ కూడా ఇప్పటికే రాజ్‌పాల్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమని ప్రకటించారు. తన అప్పులన్నీ తీర్చి, మళ్ళీ వెండితెరపై ప్రేక్షకులను అలరించాలని రాజ్‌పాల్ యాదవ్ ను అభిమానులు కోరుకుంటున్నారు.
I am ready to give ₹10 lakhs for RajPal Yadav. Let’s all Bollywood people come together to give him ₹5cr! If he does pay back only ₹5cr So he can come out from jail immediately! Let’s all help him.
— KRK (@kamaalrkhan) February 10, 2026