Reading Time: < 1 minute

రూ.12 కోట్లు దాటిన మేడారం హుండీల ఆదాయం

Caption of Image.

వరంగల్, వెలుగు: మేడారం జాతరలో భక్తుల కానుకల రూపంలో వేసిన హుండీల ఆదాయం రూ.12 కోట్లు దాటింది. గురువారం నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో పోలీస్, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కింపు మొదలుపెట్టగా, ఆరో రోజైన మంగళవారం తిరుగువారానికి సంబంధించిన 40  హుండీలు తెరిచారు. 

వీటి ద్వారా రూ.80,81,935 ఆదాయం సమకూరింది. మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేయగా, అన్నింటిని ఓపెన్​ చేశారు. చిల్లర నాణేల లెక్కింపు కొనసాగుతోంది. గత జాతరతో పోలీస్తే ఈసారి 288 హుండీలు అదనంగా ఏర్పాటు చేసినా, ఆదాయం మాత్రం పెరిగే అవకాశం కనిపించడం లేదు. బుధవారం లెక్కింపు పూర్తి కానుంది.

©️ VIL Media Pvt Ltd.