
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కడుతున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతోంది. . 52.17 లక్షల మంది ఓటర్ల కోసం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 40 వేల మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
- మహబూబాబాద్ పట్టణంలోని 32, 33 పోలింగ్ బూత్‌ల వద్ద కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య గొడవ..
- 14వ వార్డులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట… దాడి
- కాంగ్రెస్ కార్యకర్తల పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి ..
- 14 వార్డులో ఉద్రిక్త పరిస్థితి.. భారీగా చేరుకున్న పోలీసులు.
- నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఆభ్యర్థి భర్త అరవింద్ పై అదే వార్డు స్వత్రంత అభ్యర్థి భర్త దాడి
- పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద ఉన్న తన కు సంబంధించిన హాలులో దాడీ
- తనతో పాటు కారు డ్రైవర్,మునీమ్ పై దాడి
- ఏజెంట్ కు సంబంధించిన ఫారం లను వ్రాస్తున్న సమయంలో ఒక్క సరిగా వచ్చి దాడీ
- సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాడి వీడియోలు
- పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన అభ్యర్థి భర్త అరవింద్
గెలుపోటములపై ఎవరి ధీమా వారిదే!
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారున్నారు. ఆరు రోజులుగా జరిగిన ప్రచారం, ఆ తర్వాత చేపట్టిన పోల్ మేనేజ్మెంట్ను ఆధారం చేసుకొని గెలుపు మాదంటే.. మాదేనని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఐదు బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు తమకు కేటాయించిన పార్లమెంట్‌స్థానం పరిధిలోని మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకొని పనిచేశారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, సీనియర్లంతా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే, బీజేపీ ఎంపీలంతా కూడా తమ నియోజకవర్గాల పరిధిలో పోటాపోటీగా క్యాంపెయినింగ్ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడాన్ని బట్టి ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సైతం రాష్ట్రమంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఫాంహౌస్కే పరిమితం కాగా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ భారాన్నంతా మోశారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.