Reading Time: < 1 minute

టీ20 వరల్డ్ కప్‎లో శ్రీలంక బోణీ.. ఐర్లాండ్‎పై 20 పరుగుల తేడాతో విజయం

Caption of Image.

టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా ఐర్లాండ్‎తో జరిగిన మ్యాచులో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఆదివారం (ఫిబ్రవరి 8) కొలంబొలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో 20 పరుగుల తేడాతో పసికూన ఐర్లాండ్‎ను చిత్తు చేసింది. తద్వారా మెగా టోర్నీలో శ్రీలంక విజయాల ఖాతా తెరించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో  6 వికెట్లు కోల్పోయి 163 రన్స్ చేసింది. 

కుశాల్ మెండిస్ (56) హాఫ్ సెంచరీతో రాణించగా.. కమిందు మెండిస్ (44) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ నిస్సాంకా (24) ఫర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో బారీ మెక్‌కార్తీ, జార్జ్ డొక్రెల్ చెరో రెండు వికెట్లు సాధించారు. డెలానే, మార్క్ అడైర్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్  19.5 ఓవర్లలో 143 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

ఐర్లాండ్  బ్యాటర్లలో హ్యారీ టెక్టార్ (40), టక్కర్ (21), రాస్ అడైర్ (34) తప్ప మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. బౌలింగ్‎లో ఫర్వాలేదనిపించిన పసికూన బ్యాటింగ్‎లో చేతులేత్తయడంతో ఓటమి ఖాయమైంది. శ్రీలంక బౌలర్లలో తీక్షణా, హసరంగా చెరో మూడు వికెట్లు తీసి ఐర్లాండ్ నడ్డివిరిచారు. పతిరణ 2, వెల్లలాగే, చమీర చెరో వికెట్ పడగొట్టారు.  
 

©️ VIL Media Pvt Ltd.