Reading Time: < 1 minute
Telangana: ఛీ.. ఛీ నువ్వేం టీచర్‌రా.. చదువు చెప్పడం మాని స్కూల్‌లో ఆవేం పనులు..

స్కూల్‌ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ మతితప్పి ప్రవర్తించాడు. నిత్యం మద్యం తాగి వస్తూ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని చితకబాది బుద్ది చెప్పారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చింతపల్లి మండలం మాల్ ప్రాథమిక పాఠశాలలో దేవ్లా అనే టీచర్ పని చేస్తున్నాడు. ఇదే మండలంలోని తక్కెళ్ళపల్లిలో పోస్టింగ్ ఉండగా, డిప్యూటేషన్ పై 20 రోజులుగా మాల్ స్కూలుకు వస్తున్నాడు. అయితే దేవ్లా నిత్యం మద్యం మత్తులో పాఠశాలకు వచ్చేవాడు. స్కూల్‌లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు.

అయితే ఇటీవల కూడా ఓ నాలుగో తరగతి చదువుతున్న బాలికతో దేవ్‌లా అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు వెంటనే పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అనంతరం క్లాస్‌ రూమ్‌ నుంచి టీచర్ దేవ్లాను బయటకు లాక్కొచ్చి చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.