Reading Time: < 1 minute
RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. సికింద్రాబాద్‌ రైల్వేలో 1012 ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలోని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ జోన్‌లో వివిధ విభాగాల్లో 1,012 గ్రూప్‌ డీ (లెవల్‌-1) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పదో తరగతితోపాటు ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పుర రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి.

ఆన్‌లైన్‌ రాత పరీక్ష, పీఈటీ, డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్‌, తదితరాల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు జీత భత్యాలు చెల్లిస్తారు. ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీలు త్వరలోనే వెల్లడిస్తారు. ఇతర వివరాలకు ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి.

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు

సీబీఎస్సీ పదో తరగతి, 12వ తరగతి పరీక్షల 2026 అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్దుల హాల్‌ టికెట్లను సంగమ్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయ్యి ఆయా పాఠశాలలు డౌన్‌లోడ్‌ చేయవచ్చు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి వీటిని పొందొచ్చు. ఈ మేరకు బోర్డు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్ధుల రోల్‌ నంబర్‌, పరీక్ష కేంద్రం పేరు, రిపోర్టు చేయాల్సిన సమయం సరి చేసుకోవాలి. అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు పాటించవల్సిన పలు కీలక సూచనలు అందులో బోర్డు తెలిపింది.

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.