Reading Time: < 1 minute

పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి : సీపీ రష్మీ పెరుమాళ్

Caption of Image.

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా క్లియర్​ చేయాలని సీపీ రష్మీ పెరుమాళ్  ఆదేశించారు. గురువారం సీపీ ఆఫీస్ లో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో సమావేశం నిర్వహించి, పెండింగ్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తీవ్రమైన నేరాలు, మహిళలపై జరిగే వేధింపుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు.

రాత్రి సమయాల్లో దొంగతనాలు జరగకుండా బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్  వాహనాల గస్తీ పెంచాలని సూచించారు. అనుమానిత వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. అనంతరం కమిషనరేట్  పరిధిలోని వాహనాలను తనిఖీ చేశారు.

©️ VIL Media Pvt Ltd.