Reading Time: < 1 minute

చిన్నారిపై వీధి కుక్కల దాడి..నార్సింగి జన్వాడలో ఘటన

Caption of Image.

గండిపేట, వెలుగు: ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కిందపడేసి మూతి, ముక్కు, ముఖంపై తీవ్ర గాయాలు చేశాయి. చిన్నారి అరుపులు విన్న స్థానికులు గమనించి కుక్కలను తరిమికొట్టారు. ఈ సంఘటన నార్సింగి సర్కిల్‌‌ 127వ డివిజన్‌‌ జన్వాడలో జరిగింది.  వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కుక్కల బెడద అధికంగా ఉందని అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో ఇలాంటి దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.