Reading Time: < 1 minute

బంజారాహిల్స్‌లో పల్టీలు కొట్టిన కారు.. ఎవరికీ ఏం కాలేదు గానీ కారు మాత్రం నుజ్జునుజ్జు

Caption of Image.

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్–3లో కారు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–14 నుంచి రోడ్ నెంబర్–8 వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అమిత్ అనే వ్యాపారవేత్త తన ఇంటికి వెళ్తున్న సమయంలో, ఆశా హాస్పిటల్ వైపు నుంచి రోడ్ నెంబర్–8కు మలుపు వద్ద రోడ్డు సన్నగా ఉండటం, అధిక వేగంతో కారు నడపడం వల్ల కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది.

ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే కారుకు భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు, ప్రమాదానికి అధిక వేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపి ఉండవచ్చన్న అనుమానంతో అతడిని బ్రీత్ అనలైజర్ టెస్ట్‌కు పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

©️ VIL Media Pvt Ltd.