Reading Time: < 1 minute

ప్రముఖులతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ..సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమావేశం

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో సంఘ్​చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ వివిధ రంగాల ప్రముఖలతో ఆదివారం ఉదయం నోవాటెల్ లో భేటీ అయ్యారు. ఆర్ఎస్ఎస్ చరిత్రను వివరించడంతోపాటు వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంఘ్ ప్రతినిధులు తెలిపారు. 

సంఘ్ వందేండ్ల వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖులతో మోహన్ భగవత్ సమావేశమవుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు శనివారం సినీ నటుడు వెంకటేశ్ ఇంట్లో సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. సినిమాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చూపించే అంశంపై వారితో చర్చించినట్లు తెలిసింది.  

©️ VIL Media Pvt Ltd.