
వేణుస్వామి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. సామాన్యులతో పాటు పలువురు సినీ తారలు కూడా వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. గతంలో అనేక విజయవంతమైన చిత్రాలకు వేణుస్వామి పూజలు నిర్వహించారు. స్టార్ హీరోల సినిమాలకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా అదుర్స్ తన బయోపిక్ అని వేణుస్వామి పేర్కొనడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది.
మరిన్ని వీడియోల కోసం :