
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొత్త అల్లుడికి అదిరేటి ఆతిథ్యం ఇచ్చింది అత్తింటి కుటుంబం. 29 ఏళ్ల వయసు ఉన్న అల్లుడికి.. సరైన ట్రీట్ ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కాదు.. ఏకంగా.. 290 రకాల వంటకాలు, స్వీట్స్ తో భోజనం వడ్డించారు. వాటిలో పది రకాల బిర్యానీలు, 40 రకాల కూరలు, 140 రకాల మిఠాయిలు, ఇతర తిను బండారాలు పెట్టారు. 29 ఏళ్ల వయసుగల అల్లుడికి మరో సున్నా జోడించి అన్ని రకాల వెరైటీలతో భోజనం వడ్డించారు. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన రమేష్, కళావతి సాయి లక్ష్మి 30 ఏళ్ల క్రితం నర్సీపట్నం వలస వచ్చారు. గత ఏడాది జూలైలో కూతురు నవ్యకు నర్సీపట్నం కి చెందిన శ్రీహర్షతో వివాహం చేశారు. తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి గౌరవంతో కూడిన విందు ఇచ్చారు. అత్తింటికి వచ్చిన కొత్త అల్లుడికి ఇచ్చిన విందుతో ఆ అల్లుడు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.
మరిన్ని వీడియోల కోసం :