Reading Time: < 1 minute

ఏఐ కాదు ఇకపై సూపర్ ఇంటెలిజెన్స్ .. UN లో ట్రంప్ కీలక ప్రకటన

Caption of Image.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను AI  ఇకపై సూపర్‌ ఇంటెలిజెన్స్ (SI) గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… పారిశ్రామిక విప్లవం లేదా ఇంటర్నెట్ కంటే కూడా ఈ సాంకేతికత చాలా పెద్ద మార్పును తీసుకురానుందని స్పష్టం చేశారు.

ఇక నుంచి అమెరికా ప్రభుత్వ పత్రాలన్నింటిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బదులుగా సూపర్‌ ఇంటెలిజెన్స్’ (SI) అనే పదాన్ని మాత్రమే ఉపయోగిస్తామని ట్రంప్ ప్రకటించారు. కృత్రిమ అనే పదం కంటే సూపర్ అనే పదం ఎంతో సముచితంగా ఉంటుందని, అందరూ దీనినే పాటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఎవరైతే ఎస్ఐ (SI) లో గెలుస్తారో, వారే ప్రపంచాన్ని గెలుస్తారు అంటూ ఈ సాంకేతిక రేసును ఒక వ్యూహాత్మక పోటీగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం చైనాతో జరుగుతున్న ఈ పోటీలో అమెరికానే ముందంజలో ఉందని, భవిష్యత్తులోనూ ఆ ఆధిక్యతను అలాగే కాపాడుకుంటామని ట్రంప్ తేల్చిచెప్పారు.

AI వల్ల ముప్పు ఉందంటూ వస్తున్న హెచ్చరికలను కొట్టిపారేసిన ఆయన… పారిశ్రామిక విప్లవాన్ని తలపించే ఈ అద్భుత సాంకేతిక వృద్ధిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అణచివేయబోమని స్పష్టం చేశారు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూనే అమెరికాలో ఈ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు.  టెక్నాలజీ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని చాటేలా ట్రంప్ చేసిన ఈ తాజా ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

©️ VIL Media Pvt Ltd.