Reading Time: < 1 minute
Gayatri Gupta Viral Comments On Hugs And Mental Peace

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన అతికొద్ది మంది నటీమణుల్లో గాయత్రీ గుప్తా ఒకరు. ఎప్పుడూ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యాఖ్యలు చేసే ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో “ఫిజికల్ టచ్” .. మానవ సంబంధాల ప్రాముఖ్యత గురించి సైంటిఫిక్ కోణంలో మాట్లాడారు.

మనిషి జీవితంలో శారీరక స్పర్శ (Physical Touch) కేవలం కామం కోసం మాత్రమే కాదని, అది మానసిక ప్రశాంతతకు, భద్రతా భావానికి సంకేతమని గాయత్రీ పేర్కొన్నారు. “ఒక మనిషి తాను సురక్షితంగా ఉన్నానని భావించాలంటే రోజుకు కనీసం 8 నుంచి 12 హగ్గులు అవసరం. అలా జరిగినప్పుడే రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది” అని ఆమె చెప్పారు. ఈ హగ్గులు కుటుంబ సభ్యులైన అమ్మ, నాన్న, సోదర సోదరీమణుల నుంచి పొందే ఆత్మీయ ఆలింగనం కావాలని ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు కేవలం హగ్ చేసుకోవడమే కాకుండా, కనీసం 20 సెకన్ల పాటు ఆ టచ్ ఉండాలని గాయత్రీ సూచించారు.

అలా చేసినప్పుడు మన శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉండి, మనసు రిలాక్స్ అవుతుందని, ఈ ప్రపంచంలో మనం సేఫ్‌గా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుందని ఆమె వివరించారు. భద్రత ఆప్యాయతను ఇచ్చే ఏ స్పర్శ అయినా మనిషిని మానసికంగా దృఢంగా మారుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. చాలా మంది నెటిజన్లు ఆమె చెప్పిన దానిలో వాస్తవం ఉందని, ఒత్తిడితో కూడిన నేటి జీవితంలో ఆత్మీయ అనురాగాలు చాలా అవసరమని కామెంట్స్ చేస్తున్నారు.