Reading Time: < 1 minute
Deva Katta Clarification On Pawan Kalyan Movie Rumors

Deva Katta: టాలీవుడ్‌లో వైవిధ్యభరితమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ దర్శకుడు దేవా కట్టా. ఇటీవల ఆయన నెక్ట్స్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా ఆయన ఆ వార్తలకు చెక్ పెట్టారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో ఆయన తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిచ్చారు. ” పవర్ స్టార్‌తో సినిమా ప్రచారం ఎలా మొదలైందో నాకు తెలియదు కానీ, కానీ ఆయనతో కలిసి పనిచేయడం అనేది నాకైతే ఎప్పటికీ ఒక అద్భుతమైన కల. నిజానికి నా గత చిత్రం ‘రిపబ్లిక్‌’ ఐడియా కూడా ఆయనను దృష్టిలో పెట్టుకుని వచ్చిందే. భవిష్యత్తులో మా ఇద్దరికీ నచ్చే కథ కుదిరితే తప్పకుండా సినిమా చేస్తాం” అని దేవా కట్టా చెప్పుకొచ్చారు.

READ ALSO: PM Modi: యుద్ధం కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవు..

సరికొత్త స్క్రిప్ట్‌తో సిద్ధం..
గతంలో ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్’ వంటి పొలిటికల్ డ్రామాలతో మెప్పించిన ఈ డైరెక్టర్, ఈసారి తన రూటు మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను రాజకీయేతర స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నానని ఆయన వెల్లడించారు. “ప్రస్తుతం అద్భుతమైన ప్రతిభ ఉన్న వ్యక్తులతో కలిసి ఒక కొత్త కథను సిద్ధం చేస్తున్నాను. మనందరికీ వైవిధ్యంగా అనిపించే విభిన్న ఆలోచనలను అన్వేషిస్తున్నా. ప్రస్తుతానికి రాజకీయాలకు సంబంధించిన సినిమాలు ఏవీ చేయడం లేదు” అని స్పష్టం చేశారు. త్వరలోనే తన కొత్త సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తానని దేవా కట్టా వెల్లడించారు.

READ ALSO: Indian Railways: రైల్వే టికెట్ రద్దు చేస్తున్నారా.. ఆ సమయంలోపు క్యాన్సల్ చేస్తే పైసా రాదు! కొత్త నిబంధనలు ఇవే..