Reading Time: < 1 minute
Jagityal Jeevan Reddy Resignation Congress Mahesh Goud Meeting Update

Jeevan Reddy: జగిత్యాలలో జీవన్ రెడ్డితో పీసీసీ అధ్యక్షులు మహేష్ భేటీ ముగిసింది. పార్టీలో కొనసాగండి, పార్టీని వీడకండి. భవిష్యత్తుపై చర్చిద్దామని పీసీసీ చర్చలు జరిపారు. ఏఐసీసీ నాయకులు సైతం పార్టీలోనే కొనసాగాలని జీవన్ రెడ్డిని కోరారు. భేటీ అనంతరం మహేష్‌గౌడ్ మాట్లాడారు. “జీవన్ రెడ్డి మా తండ్రి సమానులు. 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయనది. రాష్ట్రంలో అంతకన్నా సీనియర్ నాయకులు లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఇబ్బంది పడ్డారు. ఈ వయసులోనూ ఇబ్బంది పడ్డారు. కొన్ని సార్లు రాజకీయంలో అనుకోని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. జీవన్‌రెడ్డి ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి నా సూచనల మేరకు మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు. నేను కూడా ఈ రోజుల కలిశాను. కాంగ్రెస్‌తో అనుబంధాన్ని తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని వారికి విన్నవించడం జరిగింది. కార్యకర్తల ఒత్తిడి తదితర కారణాల వల్ల వారు ఈ నిర్ణయం తీసుకుంది. వారు పార్టీలోనే ఉండాలని ఏఐసీసీ పట్టుబడుతోంది. నాకు జీవన్‌రెడ్డితో 1986 నుంచి పరిచయం. అప్పటి నుంచి మాకు రాజకీయంగా సలహాలు ఇచ్చారు” అని తెలిపారు. జీవన్ రెడ్డి రాజీనామా చేయరు అనే ఆశతో ఇక్కడి నుంచి వెళ్తున్నామని మహేష్‌కుమార్ గౌడ్ చెప్పారు.

READ MORE: Trump: Let’s do it” అన్నావు.. ఇరాన్ యుద్ధానికి హెగ్సెత్‌ను బాధ్యుడిని చేసిన ట్రంప్

ఇక ఈ భేటీ అంనంతరం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ చర్చలు ఫలించలేదు. జీవన్‌రెడ్డి ఇంటిపై ఉన్న కాంగ్రెస్ ప్లేక్సీని అభిమానులు తొలగించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. “ఇది పరిష్కారం లేని సమస్యగా మారింది.. సమస్యకు పరిష్కారం నా దగ్గర లేదు.. వారి దగ్గర కూడా లేదు. రేపు 10 గంటలకు కార్యకర్తలు అందరు భేటీ అవ్వండి. గార్డెన్‌కి రండి.. రేపు భవిష్యత్తు, పయనం ఎలా ఉంటుందో తెలియదు.. కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వపక్షంతో యుద్ధం నేను చేయలేను. నేను నా నిర్ణయం రేపు ప్రకటించబోతున్న.. నా నిర్ణయం దైవ నిర్ణయంగా భావిస్తున్నా.” అని జీవన్‌రెడ్డి తెలిపారు. ఇక కాంగ్రెస్‌కు రేపు జీవన్‌రెడ్డి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

READ MORE: Saudi Arabia-Iran-Mecca: రక్తం పారింది… ఇస్లాం పవిత్ర నగరం కోసం ఇరాన్‌-సౌదీ యుద్ధం..!