
అంబర్ పేట: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం… రామరాజు, మాధవి అనే దంపతులు అంబర్ పేట లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు శశాంకు అనే కుమారుడు ఉన్నాడు. ఈ కుటుంబం గత కొంత కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. దంపతులు తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కావడంతో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు లో తేలింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.