Reading Time: < 1 minute
Stock Market Snesex And Nifty Is Down

దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మంగళవారం ఉదయం నుంచి మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఓ వైపు ఏఐ ఆధారిత అంతరాయం, ఇంకోవైపు ట్రంప్ సుంకాల భయం వెంటాడుతున్నాయి. అలాగే ముడి చమురు ధరలు పెరగడం, ప్రపంచ మార్కెట్లలో బలహీనమైన సంకేతాలు మార్కెట్ ఒత్తిడికి తోడయ్యాయి. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు గ్లోబల్ టారిఫ్‌లను రద్దు చేసింది. అయితే మరో రూపంలో భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరించారు. ఈ భయాలే దేశీయ మార్కెట్‌ను దెబ్బ తీశాయి.

ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: కామన్వెల్త్ క్రీడల్లో గడ్కరీ ఏం చేశారో తెలియదా? బీజేపీపై మల్లిఖార్జున్ ఖర్గే విమర్శలు

ప్రస్తుతం సెన్సెక్స్ 1009 పాయింట్లు నష్టపోయి 82,284 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 287 పాయింట్లు నష్టపోయి 25, 426 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఇన్ఫోసిస్ 4 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆసియన్ పెయింట్స్ 0.5 శాతం వరకు పెరిగాయి.

ఇది కూడా చదవండి: AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్