
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు తాగునీటి సరఫరాకు ప్రధా న వనరులుగా పనిచేస్తున్న జంట జలాశయాలయిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా ఉండటం పై హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి కీ లక ఆదేశాలు జారీ చేసింది. జలాశయాల్లో మ రుగునీరు, పారిశ్రామిక వ్యర్ధాలు ప్రవహించకుండా ఉండడానికి తీసుకున్న చర్యల వివరా లు నాలుగు వారాల్లో తెలపాలని ఆదేశించింది. జంట జలాశయాల కలుషితమవుతున్నట్లు ప త్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సుమోటో గా స్వీకరించింది. దీనిపై విచారణ జరిపిన ధ ర్మాసనం జలాశయాలలోకి మురుగునీరు, పా రిశ్రామిక వ్యర్థాలు ప్రవహించడాన్ని తీవ్రంగా పరిగణించింది.
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్ శాఖల ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి, గ్రేటర్ హై దరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబా ద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, హై దరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డులను ప్రతివాదులుగా చే ర్చిన ధర్మాసనం అధికారులకు నోటిసులు జారీ ఇచ్చింది. విచారణ సందర్భంగా పత్రికల్లో వ చ్చిన కథనాలను ధర్మాసనం ప్రస్తావించింది, ఇ ది మురుగునీరు, పారిశ్రామిక కాలుష్య కారకాలను నిరంతరం విడుదల చేయడం వల్ల రెండు జలాశయాలలో నీటి నాణ్యత గణనీయంగా క్షీ ణిస్తుందని పేర్కొంది. నీటిలో విషపూరిత పదార్థాలతో ప్రజలు తీవ్రమయిన ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతాయని, కలుషితమైన నీరు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని గమనించిన ధర్మాసనం, జ లాశయాలలోని నీటి నాణ్యత బ్యూరో ఆఫ్ ఇం డియన్ స్టాండర్డ్ (బిఐఎస్) సూచించిన ప్ర మాణాలకు అనుగుణంగా లేదని పేర్కొంది.