Reading Time: < 1 minute

ఆదిలాబాద్ లో బ్రిడ్జి పై నుంచి కిందపడ్డ ఆర్టీసీ బస్సు

Caption of Image.

ఆదిలాబాద్  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఫిబ్రవరి 23న ఉదయం ఉట్నూరు మండలం శ్యామ్ పూర్ లో   బ్రిడ్జి పై నుంచి  అర్టీసీ బస్సు కిందపడింది.అసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్ లోని బ్రిడ్జి పై నుంచి కింద పడిపోయింది.   ఈ ఘటనలో  ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని  చికిత్స కోసం  అసుపత్రికి‌ తరలించారు. 

ఈ ఇరుకు బ్రిడ్జిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.