Reading Time: 2 minutes

AuraOfUstaad: ఉర్రూతలూగించేలా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్.. పవర్ స్టార్ ‘మేనరిజాన్ని’ కాచివడపోసిన చంద్రబోస్

Caption of Image.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ను స్వీడప్ చేశారు. ఇందులో భాగంగా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించిన, దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన రెండో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ (AuraOfUstaad) పేరుతో వచ్చిన ఈ సాంగ్ హై ఎనర్జీతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

పవన్ కళ్యాణ్ మేనరిజం, ఆయన వ్యక్తిత్వం వెనుక ఉన్న భావాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. “ఉస్తాద్” అనే పదానికి ఉన్న అర్ధాన్ని, పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను హైలైట్ చేస్తూ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘‘మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు..బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు ’’ అనే పదాలు పవర్ కళ్యాణ్ తెగింపును గుర్తుచేస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్ ఆరాను సెలెబ్రేట్ చేసుకునేలా ఉన్న ఈ పాటకు దేవిశ్రీ ఉర్రూతలూగించే సంగీతం అందించారు. అంతకంటే, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఇందులోని ప్రతి పదం పవన్ కళ్యాణ్ని డిఫైన్ చేసేలా, ఆయన ఆరా కళ్ళకు కనపడేలా ఉంది. సింపుల్గా చెప్పాలంటే.. “పవన్ కళ్యాణ్ జీవితాన్ని కాచి వడబోస్తే వచ్చే పాటలా ఉంది ఈ పాట”. ఇందులో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్‌ను క్విక్ కట్స్‌తో చూపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన పాత సినిమాల్లోని పాపులర్ మేనరిజంను ఇందులో రిపీట్ చేయడం ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్‌గా మారింది.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల,రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. డైరెక్టర్ దశరథ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. మొత్తానికి, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందు నుంచే భారీ హైప్‌ను సొంతం చేసుకుంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.