Reading Time: 2 minutes

T20 World Cup: చెలరేగిన లంక బౌలర్లు.. తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ పరిమితం

Caption of Image.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. పల్లెకెలె మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రెండు ఓవర్లలో భారీ షాట్స్ ఆడిన ఇంగ్లాండ్ ఓపెనర్లు మూడో ఓవర్లో జోస్ బట్లర్ (7) LBWగా దునిత్ వెల్లాలేజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 

అనంతరం క్రీజులోకి వచ్చిన జాకబ్ బెథెల్ (3) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మహేష్ తీక్షణ వేసిన బౌలింగ్ లో బెథెల్ ఆడిన బాల్ టాప్ ఎడ్ఙిలో తగిలి థర్డ్-మ్యాన్ లో ఉన్న మధుశంక అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ తీవ్ర కష్టాల్లో పడింది. బ్యాటింగ్ కి వచ్చిన టామ్ బాంటన్ (6) రన్ ఔట్, అనంతరం ఇంగ్లీష్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (14) అవుట్ కావడంతో కీలకమైన వికెట్లను బ్రూక్ సేన కోల్పోయింది. 

ఒకవైపు, ఇంగ్లాండ్ జట్టు వరుసగా వికెట్లను కోల్పోతున్నా, ఓపెనర్ ఫిల్ సాల్ట్ (62) మాత్రం హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. సామ్ కరన్ (11), లియామ్ డాసన్ (6), జోఫ్రా ఆర్చర్ (0) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చివర్లో విల్ జాక్స్ మాత్రం కాసేపు శ్రీలంక బౌలర్లపై ఎదురు దాడి చేసే ప్రయత్నం చేయగా.. దిల్షన్ మధుశంక బౌలింగ్ భారీ షాట్ ఆడబోయిన జాక్స్ దునిత్ వెల్లలాగేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. లాస్ట్ ఓవర్లో జేమీ ఓవర్టన్ (10*) ఒక సిక్సు కొట్టడంతో ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 

మరోవైపు, శ్రీలంక బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బౌలర్ల క్రీజుల నిలవలేకపోయారు. దునిత్ వెల్లలగే 3 వికెట్లు తీసుకుని ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించగా, దిల్షన్ మదుశంక, మహేశ్ తీక్షణ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, దుష్మంత చమీర ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ 146/9 పరుగులు చేసింది.  

©️ VIL Media Pvt Ltd.