Reading Time: < 1 minute

Shoaib Akhtar: పాకిస్తాన్ అందుకే ఓడిపోతుంది.. షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Caption of Image.

Shoaib Akhtar: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీలో టీమిండియా చేతిలో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమి తర్వాత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఓటమిపై మాజీ పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. భారత్‌తో ఆడేటప్పుడు పాకిస్థాన్ ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతుంది అన్నారు. జట్టు ఎంపిక కూడా సరిగ్గా లేదు.. అసలు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న మా జట్టు ప్రపంచంలోని ఏ టీమ్ నైనా ఓడించే సత్తా కలిగి ఉందని అక్తర్ వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉండగా, టీ20 వరల్డ్ కప్ సూపర్-8 ఆరంభంలోనే వర్షం కీలక పాత్ర పోషిస్తుందన్న అంచనాలు నిజమయ్యాయి. సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరగాల్సిన పాకిస్థాన్–న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయ్యింది. ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు ‘నో రిజల్ట్’గా ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున ఇచ్చారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ టాస్ పడిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది. మైదానాన్ని కవర్లతో కప్పినా, పిచ్‌పై నీరు నిలవడంతో ఆట ఆడేందుకు పరిస్థితులు సహకరించలేదు. ఫలితం రావాలంటే కనీసం ఐదు ఓవర్ల ఆటైనా జరగాలి.. కట్-ఆఫ్ సమయం రాత్రి 11:10 గంటలుగా నిర్ణయించినా, వాతావరణం సహకరించలేదు.. సూపర్-8 దశకు రిజర్వ్ డేలు లేకపోవడంతో ఈ మ్యాచ్ రద్దు అయింది.

►ALSO READ | IND vs SA: భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్.. కలవర పెడుతున్న పిచ్ రిపోర్ట్!

ఇప్పటికే కొలంబోలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రూప్-2 నుంచి శ్రీలంకలోని పల్లెకెలె మైదానంలో ఈరోజు (ఫిబ్రవరి 22న) ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడబోతున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.  
 

©️ VIL Media Pvt Ltd.