Reading Time: 2 minutes

Rashmika Lifestyle: పెళ్లి వార్తల మధ్య రష్మిక దర్శనం.. సింపుల్ లుక్‌తో స్టన్నింగ్.. ఈ కుర్తా ధర ఎంతంటే?

Caption of Image.

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్స్ విజయ్, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా జరగనుంది. వీరి పెళ్లి చాలా ప్రైవేట్‌గా ఉదయ్‌పూర్‌లో హిస్టారికల్ ప్యాలెస్ వేదిక కానుంది. ఈ వేడుకను కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించాలని ఈ జంట నిర్ణయించుకుంది. అయితే, పెళ్లిపై అధికారిక ప్రకటన లేకపోయినా, తాజా పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.

ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక దర్శనం

ఇటీవల రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఆమె ఉదయ్‌పూర్‌కు ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం బయలుదేరినట్లు సమాచారం. సింపుల్ ప్రింటెడ్ కుర్తా-ప్యాంట్ సెట్‌లో ఆమె ఎంతో ఎలిగెంట్‌గా (తక్కువ డిజైన్, ఎక్కువ అందం) కనిపించారు. ఈ క్రమంలో రష్మిక ధరించిన డ్రెస్ కంపెనీ.. దాని ఖరీదుపై నెటిజన్లు లుక్కేస్తున్నారు. 

ఈ కుర్తా సెట్ ‘CORD’ బ్రాండ్‌ది కాగా దాని ధర సుమారు రూ.19,800గా చెబుతున్నారు. దీనికి ఆమె Dior 30 Montaigne స్లైడ్స్, Bottega Veneta Campana బ్యాగ్‌ను జతచేశారు. బొట్టెగా వెనెటా – కాంపనా బ్యాగ్ రూ.3,900లుగా ఉంది.

ఈ సందర్భంగా రష్మిక తన జుట్టును సాదాసీదాగా బన్‌గా కట్టుకుని, బ్లాక్ మాస్క్‌తో కనిపించి ఫోటోల కోసం ఎక్కువగా పోజులు ఇవ్వకుండా త్వరగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

విజయ్ ఇంటి అలంకరణలు..పెళ్లి సూచనలేనా?

ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసం వివాహానికి ముందు దీపాల అలంకరణతో మెరిసిపోతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఇంటి ముందు ప్రత్యేక లైటింగ్, పుష్పాలంకరణలతో సన్నాహాలు జరుగుతున్న ఫోటోలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటివరకు ఈ విజయ్-రష్మిక నుంచి పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇంటి అలంకరణలు, వైరల్ వెడ్డింగ్ కార్డుతో పెళ్లి వార్తలు మరింత బలపడుతున్నాయి.. ఇవన్నీ పెళ్లి వేడుకల కోసమేననే చర్చలు జోరందుకున్నాయి.

ఫిబ్రవరి 26న పెళ్లి?

వార్తల ప్రకారం, ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఒక హిల్ రిసార్ట్‌లో వీరి వివాహం జరగనుంది. ఫిబ్రవరి 24న హల్దీ వేడుక, 25న సంగీత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకలు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా జరగనున్నట్లు తెలుస్తోంది. సినిమా పరిశ్రమకు చెందిన వారికి అధికారిక ఆహ్వానాలు పంపలేదని ప్రచారం.

అయితే పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తోంది.మార్చి 4, 2026న తాజ్ కృష్ణా హోటల్‌లో రష్మిక, విజయ్ పెళ్లి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

►ALSO READ | Abishan Jeevinth: 25 ఏళ్లకే ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌లో చోటు.. డైరెక్టర్ అభీషన్ సెన్సేషనల్ జర్నీ

ఏదేమైనా .. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో హిట్ జోడీగా గుర్తింపు పొందిన ఈ జంట నిజంగానే వివాహ బంధంలోకి అడుగుపెడతారా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విజయ్, రష్మిక మూవీ:

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం ‘రౌడీ జనార్థన్’ తో పాటుగా ‘రణబాలి’ సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన్న పాన్ ఇండియా క్రేజ్‌తో పలు భారీ ప్రాజెక్టులలో నటిస్తోంది. వృత్తిపరంగా ఇద్దరూ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకోవడం విశేషం.

అంతేకాదు విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా మూవీ ‘రణబాలి’ (VD14). రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ మూవీ టైటిల్ గ్లింప్స్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది.

©️ VIL Media Pvt Ltd.