Reading Time: < 1 minute

తిరుమల కొండ రద్దీ.. పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 20 గంటలు

Caption of Image.

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో  తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు,. నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండాయి.  తిరుమల భక్తులు క్యూలైన్​ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు బారులు తీరారు. శ్రీవారిఆలయ పరిసరాలు,వసతి సముదాయాలు,ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. 

శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి సుమారు 22 గంటలు, టైమ్ స్లాట్ (SDD) దర్శనానికి సుమారు 8 గంటలు, 300 రూపాయిల ప్రత్యేక  దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ‌

 శనివారం ( ఫిబ్రవరి 21)  తిరుమల శ్రీవారిని 82వేల 043 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32 వేల299 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.74 కోట్లు సమర్పించారు.

©️ VIL Media Pvt Ltd.