Reading Time: < 1 minute

రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవాలన్నా పేరెంట్స్‌‌‌‌కు చెప్పాల్సిందే..వివాహ నిబంధనల్లో మార్పులకు గుజరాత్ సర్కారు సిద్ధం

Caption of Image.

అహ్మదాబాద్: గుజరాత్ ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది. ప్రేమ వివాహాలు చేసుకుని పారిపోయే జంటల విషయంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈమేరకు గుజరాత్ వివాహాల నమోదు చట్టం–2026కు సవరణలు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం హర్ష్ సింఘ్వీ అసెంబ్లీలో వెల్లడించారు. ప్రేమ వివాహాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. యువతులకు రక్షణ కల్పించడానికే ఈ మార్పులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.