Reading Time: < 1 minute

సినిమా ఛాన్స్ పేరుతో అసభ్య ప్రవర్తన… కాస్టింగ్ డైరెక్టర్ పై కేసు

Caption of Image.

జూబ్లీహిల్స్, వెలుగు:  సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ యువతి పట్ల కాస్టింగ్ డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఫిలింనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చిన బాధితురాలికి ఆమె స్నేహితుడి ద్వారా జీఎం రవి అనే కాస్టింగ్ డైరెక్టర్​ పరిచయమయ్యాడు. 

తమ సినిమాలో ఛాన్స్ ఇస్తామని లుక్ టెస్ట్ కోసం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7లోని కార్యాలయానికి రావాలని పిలిచాడు. అక్కడికి వెళ్లిన యువతిని ఏకాంతంగా గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.