Reading Time: < 1 minute

T20 World Cup NZ vs PAK: సూపర్ 8లో న్యూజిలాండ్– పాకిస్తాన్ మ్యాచ్ రద్దు

Caption of Image.

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 తొలి మ్యాచ్ లో  న్యూజిలాండ్–పాకిస్తాన్ మ్యాచ్ రద్దైంది. కొలంబోలో జరుగుతోన్న ఈ మ్యాచ్ ఒక్క బాల్ కూడా వేయకుండానే  వర్షం కారణంగా రద్దైంది.   మ్యాచ్ రద్దుతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కాయి. 

పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా, వర్షం ముప్పు ఉన్నప్పటికీ తమ విజయ మంత్రాన్నే కొనసాగిస్తామని చెప్పాడు. అయితే టాస్ అనంతరం మళ్లీ వర్షం మొదలవడంతో పిచ్, అవుట్ఫీల్డ్ రక్షణ కోసం గ్రౌండ్ సిబ్బంది కవర్లు పూర్తిగా కప్పేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లలోకే  పరిమితమయ్యారు. వర్షం తగ్గే చాన్స్ లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 

►ALSO READ | IND vs SA: 2024 ఫైనల్లో ఓటమిని మర్చిపోయాం.. క్వింటన్ డికాక్ ఆసక్తికర వ్యాఖ్యలు

మ్యాచ్ రద్దుతో పాకిస్తాన్,న్యూజిలాండ్ సెమీస్ చేరాలంటే  తమ చివరి మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.మరో వైపు రేపు పల్లెకెలెలో ఇంగ్లాండ్ శ్రీలంక,అహ్మదాబాద్ లో ఇండియా –సౌతాఫ్రికా తలపడనున్నాయి. 
 

©️ VIL Media Pvt Ltd.