Reading Time: 2 minutes

PAK vs NZ Match Delay: పాకిస్తాన్ – న్యూజిలాండ్ మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకి

Caption of Image.

PAK vs NZ Match Delay: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 దశ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో జరుగుతోంది. గ్రూప్ దశలో మూడు విజయాలతో కివీస్ మంచి ఆధిపత్యం చూపించినప్పటికీ, పూర్తి స్థాయిలో ఫామ్‌లోకి రాలేదన్న భావనతో టీంలో 3 మార్పులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అతనితో పాటు ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నారు. ఇక పాకిస్థాన్ జట్టులో ఒకే ఒక్క మార్పు చేసినట్లు కెప్టెన్ సల్మాన్ ఆఘా చెప్పాడు. ఖవాజా నఫయ్ స్థానంలో ఫఖర్ జమాన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు. బాబర్ ఆజమ్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ అతడికి తుది జట్టులో స్థానం కొనసాగించారు. ఫఖర్ జమాన్ తిరిగి రావడం పాకిస్థాన్‌కు కీలకంగా మారవచ్చని భావిస్తున్నారు.  

పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా, వర్షం ముప్పు ఉన్నప్పటికీ తమ విజయ మంత్రాన్నే కొనసాగిస్తామని చెప్పాడు. అయితే టాస్ అనంతరం మళ్లీ వర్షం మొదలవడంతో పిచ్, అవుట్‌ఫీల్డ్‌ రక్షణ కోసం గ్రౌండ్ సిబ్బంది కవర్లు పూర్తిగా కప్పేశారు. దీని వల్ల మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లలోకే పరిమితం అయ్యారు. వాతావరణ పరిస్థితులను మ్యాచ్ అధికారులు గమనిస్తూ, వర్షం తగ్గే వరకు వేచి చూస్తున్నారు. కొలంబోలో అకస్మాత్తుగా వర్షాలు కురవడం సాధారణమే కావడంతో ఇలాంటి అంతరాయాలు తరచూ ఎదురవుతుంటాయి. ఈ వర్షం ఇలాగే కొనసాగితే ఓవర్లు కుదించే అవకాశం ఉంది. డక్‌వర్త్–లూయిస్–స్టెర్న్ (DLS) పద్ధతి ప్రకారం మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. వర్షం కాస్త తగ్గడంతో గ్రౌండ్ ని అంపైర్లు పరిశీలించారు. మరోసారి పిచ్ ని పరిశీలించిన తర్వాతే మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.. అనే దానిపై క్లారిటీ రానుంది.  

►ALOS READ | PAK vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్..

ఇరు జట్లు: 
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్( కెప్టెన్), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్. 
 

©️ VIL Media Pvt Ltd.