Reading Time: < 1 minute

హైవేపై బైక్ ను ఢీ కొట్టిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్

Caption of Image.

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిపై బైక్ ను కారు  ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులు  అక్కడికక్కడే మృతి చెందారు. హుస్నాబాద్ నుంచి తోటపల్లికి వెళ్తుండగా కొత్తపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనతో  కాసేపు  హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్తానికుల సమాచారంతో ఘటనా స్తలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 మృతులు అవదూత శ్రీనివాస్, శ్రీరామ రామచంద్రంగా గుర్తించారు.  వీరిద్దరూ బొమ్మనపల్లి  మండలం చిరుగుమామిడి గ్రామస్తులుగా గుర్తించారు పోలీసులు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో స్తానికులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 

©️ VIL Media Pvt Ltd.