Reading Time: 2 minutes

Suryakumar Yadav: అభిషేక్ శర్మ ఫామ్‌ గురించి టెన్షన్‌ వద్దు.. సూర్యకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. 

Caption of Image.

Suryakumar Yadav: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో అభిషేక్ శర్మ టాప్ రన్‌గెటర్‌గా నిలుస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ టోర్నీ ఆరంభంలోనే అభిషేక్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడంతో అతని ఫామ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గట్టిగా స్పందించాడు. దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన స్కై, అభిషేక్ ప్రస్తుత ఫామ్ తనను ఏమాత్రం ఆందోళనకు గురి చేయడం లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు, అతడిపై విమర్శలు చేసే వారిపైనే తనకు ఎక్కువ టెన్షన్‌గా ఉందని పేర్కొన్నాడు.  

అభిషేక్ శర్మ గురించి ఆందోళన చెందుతున్న వాళ్ల గురించి నేనే ఎక్కువగా ఆందోళన పడుతున్నాను అని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. అతడు తర్వాత ఆడే జట్ల పరిస్థితి ఏంటో ఆలోచించాలి అని పేర్కొన్నాడు. గత ఏడాది అభిషేక్ జట్టు కోసం అన్నీ చేశాడు.. ఇప్పుడు మేము అతడికి మద్దతుగా నిలిచే సమయం వచ్చింది అని స్పష్టం చేశాడు. కాగా అభిషేక్ శర్మ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉంది.. అతడు త్వరలోనే తన గత ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని స్కై భాయ్ ధీమా వ్యక్తం చేశాడు. అదే సమయంలో సూర్యకుమార్ మాటలు ప్రత్యర్థి జట్లకు ఇది ఒక హెచ్చరికగా మారిందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అభిషేక్ ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే, ప్రత్యర్థి బౌలర్లకు కష్టకాలమేనన్న సందేశాన్ని సూర్య వ్యాఖ్యలతో క్లియర్ గా తెలిసిపోతుంది.  

►ALSO READ | IND-W vs AUS-W: ఆస్ట్రేలియాతో మ్యాచ్.. భారత్ భారీ స్కోర్..? 

వరుసగా విఫలమైతున్నప్పటికీ అభిషేక్ శర్మకు తుది జట్టులో స్థానం కొనసాగుతుందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపారు. జట్టు మేనేజ్‌మెంట్‌లో అభిషేక్ ప్రదర్శనపై ఎలాంటి చర్చే జరగడం లేదని స్పష్టం చేశారు. అతను వరల్డ్ క్లాస్ ప్లేయర్, ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇతర ఆటగాళ్లు బాధ్యత తీసుకుని నిలబడ్డారు.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో చాలా కీలక దశకు చేరుకున్నాం.. ఈ సమయంలో అభిషేక్ తప్పకుండా రాణిస్తాడనే నమ్మకం మాకు ఉందని మోర్నీ మోర్కెల్ ధీమా వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 దశలో భాగంగా రేపు (ఫిబ్రవరి 22న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.