Reading Time: < 1 minute

శ్రీవారి భక్తులకు అలర్ట్: మే నెల దర్శన కోటాపై కీలక అప్ డేట్.. 

Caption of Image.

దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి మే నెల దర్శన కోటా కు సంబంధించి కీలక అప్ డేట్ విడుదల చేసింది టీటీడీ. మే నెలకు సంబంధించిన దర్శన కోటా, గదుల కోటా విడుదల వివరాలు వెల్లడించింది టీటీడీ. ఫిబ్రవరి 21 నుంచి 27వ తేదీ వరకు దర్శన కోటా విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయ‌నున్నట్లు తెలిపింది టీటీడీ.

వర్చువల్ సేవల కోటా విడుదల

ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు తెలిపింది.

23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనుట్లు తెలిపింది.

శ్రీవాణి దర్శన కోటా విడుదల

23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

23న మధ్యాహ్నం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది టీటీడీ.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది టీటీడీ.

గదుల కోటా విడుద‌ల‌…

24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.

27న శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా విడుదల 

  • ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.
  • https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని సూచించింది టీటీడీ.
©️ VIL Media Pvt Ltd.