
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ దగ్గర పేలుళ్లకు లష్కరే తోయిబా మరోసారి కుట్ర చేసింది. లష్కరే తోయిబా పేలుళ్ల కుట్రపై ఇంటెలిజెన్స్ అలర్ట్తో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఎర్రకోట చాందిని చౌక్ దగ్గర ఉన్న ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు తేల్చాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఐఈడీ బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్లు సమాచారం.
🚨 Terror Alert in Delhi: Red Fort, Chandni Chowk Temple on Radar
Security agencies issue alert over possible blast threat near the in Delhi.
Intelligence inputs suggest a temple in Chandni Chowk could be targeted.
Pakistan-based terror outfit allegedly plotting an IED attack.… pic.twitter.com/UYgHbpy2Wv
— Atulkrishan (@iAtulKrishan1) February 21, 2026
ఇంటెలిజెన్స్ సమాచారంతో కేంద్ర ప్రభుత్వ బలగాలు, ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయి చాందినీ చౌక్ దగ్గర నిఘా పెంచారు. బాంబు స్క్వాడ్స్తో ముమ్మరంగా తనిఖీలు చేశారు. మరీ ముఖ్యంగా ఓల్డ్ ఢిల్లీలో భద్రత పెంచారు. అదనపు బలగాలను ఓల్డ్ ఢిల్లీకి పంపించారు. ప్రతీ వాహనాన్ని చెక్ చేసి పంపిస్తున్నారు.
2025, నవంబర్లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన బ్లాస్ట్లో 15 మంది చనిపోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలాన్ని మొత్తం నల్లటి పొగ కమ్మేసింది. అరుపులు.. ఏడుపులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఓ వ్యక్తి డెడ్‌బాడీ కారు సైడ్ మిర్రర్పై వేలాడుతూ కనిపించింది.
ఆటో రిక్షాపై ఓ వ్యక్తి చేయి తెగిపడింది. హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 22 కార్లు, 2 ఈ -రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. కొన్ని మీటర్ల దూరం వరకు పార్క్ చేసిన వాహనాల అద్దాలూ ధ్వంసం అయ్యాయి. ఇండ్లు, దుకాణాల తలుపులు, కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ పేలుళ్ల ఘటన ఉగ్రదాడిగా నిర్ధారణ అయింది.