Reading Time: < 1 minute

ఎవర్ గ్రీన్తో మెడికేర్ ఒప్పందం

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: మెడికవర్ హాస్పిటల్, అత్యవసర సేవల కోసం ఎవర్ గ్రీన్ హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల ఎయిర్ అంబులెన్స్, రాష్ట్రాల మధ్య క్రిటికల్ కేర్ రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. గుండెపోటు, ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ చికిత్స అందించేలా వ్యవస్థను రూపొందించారు.

ఆసుపత్రి ప్రారంభానికి ముందే రోగుల భద్రత కోసం ఈ నెట్‌‌‌‌వర్క్ సిద్ధం చేశారు. నిపుణుల పర్యవేక్షణలో దేశ విదేశాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన రవాణా సేవలు అందుతాయి. ప్రతి నిమిషం విలువైనదని భావిస్తూ ఈ అడుగు వేశామని మెడికేర్​  తెలిపింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌‌‌‌లో సంస్థ హాస్పిటల్‌‌ను ఏర్పాటు చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.