
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గ్రూప్–ఏ నుంచి జరుగుతున్న మ్యాచ్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ మోనాంక్ పటేల్, ఫినిషర్ సంజయ్ కృష్ణమూర్తి ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 87 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. నమీబియాకు వికెట్లు తీసే అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి ఓవర్‌లోనే మోనాంక్ పటేల్ ఇచ్చిన క్యాచ్ వదిలేయగా, కృష్ణమూర్తి 32 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎరాస్మస్ క్యాచ్ జార విడివడంతో.. ఈ రెండు తప్పిదాలు USAకి కలిసి వచ్చాయి.
నమీబియా బౌలర్లలో విల్లెం మైబర్గ్ (2/22), కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (2/27) చెరో రెండు వికెట్లు తీశారు. అయినప్పటికీ అమెరికా బ్యాటింగ్‌ను పూర్తిగా కట్టడి చేయలేకపోయారు. ఈ పిచ్ పరిస్థితి పరిశీలిస్తే.. కొత్త బంతి గట్టిగా ఉన్నప్పుడు ఈజీగా పరుగులు వచ్చాయి. స్పిన్నర్లు బౌలింగ్‌కు రావడంతో బౌండరీలు కొట్టడం యూఎస్ఏ బ్యాటర్లకు కష్టంగా మారింది. ఇప్పుడు నమీబియా ముందు భారీ లక్ష్యం ఉంది. ఈ స్కోర్‌ను ఛేదించడం నమీబియాకు పెద్ద సవాలుగా మారనుంది.
లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా.. కూడా దూకుడుగా ఆడుతుంది. 5 ఓవర్లకి 51 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ ఫ్రైలింక్ (19) తక్కువ పరుగులకే ఔట్ అయినా.. మరో ఓపెనర్ లౌరెన్ స్టీన్‌క్యాంప్ ( 31) బౌండరీలతో యూఎస్ఏ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, లౌరెన్ స్టీన్‌క్యాంప్ ఉన్నారు. మరో 88 బంతుల్లో 146 పరుగుల వెనుకంజలో నమీబియా టీం ఉంది.
SANJAY ON FIRE! 🔥
Brings up his 50 with a six over long on. USA are cruising toward a huge total thanks to this masterclass from Krishnamurthi. 👏
ICC Men’s #T20WorldCup | #NAMvUSA | LIVE NOWhttps://t.co/zCAuTpMj2F pic.twitter.com/ZL1R2DqOK3
— Star Sports (@StarSportsIndia) February 15, 2026